Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిందా రాజపక్సా
కొలంబో : శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి విదేశీ శక్తులు, గత ప్రభుత్వం కారణమని మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని మహిందా రాజపక్సా విమర్శించారు. పదవీచ్యుతి పొందిన తమ ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కూడా కారణమని అంగీకరించారు. శ్రీలంక జాతీయాస్తులపై విదేశీ శక్తులు కన్ను వేశాయని, ఆ శక్తుల స్థానిక ఏజెంట్లు ఇప్పటికీ ఇంకా క్రియాశీలంగానే పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు వారు ఆజ్యం పోస్తున్నారని అన్నారు. అధ్యక్షుడు, ఆర్థిక మంత్రి అయిన రణీల్ విక్రమసింఘె పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మహిందా పార్లమెంట్లో మంగళవారం మాట్లాడారు. వారి చర్యల కారణంగా పర్యాటక రంగం దెబ్బ తిందన్నారు. ఇప్పుడే కోలుకోవడం ఆరంభించిందని చెప్పారు. సంక్షోభ సమయంలో విక్రమసింఘె సమర్పించిన ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే దిశగా పెద్ద మందడుగు అని ఆయన వ్యాఖ్యానించారు.