Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రిటీష్ ప్రభుత్వ అనుమతి లేకుండా స్వాతంత్య్రం కోసం కొత్తగా రెఫరెండాన్ని నిర్వహించే అధికారం స్కాట్లాండ్కు లేదని బ్రిటన్ సుప్రీం కోర్టు బుధవారం రూలింగ్ ఇచ్చింది. బ్రిటన్ నుండి విడిపోయేందుకు స్కాటిష్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ఇదొక పెద్ద ఎదురుదెబ్బ. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా తీర్పు చెప్పారని సుప్రీంకోర్టు అధ్యక్షుడు రాబర్ట్ రీడ్ తెలిపారు. లండన్లో ఈ విషయంలో ఇరు పక్షాలు వాదనలు ముగిసిన ఆరు వారాల అనంతరం ఈ తీర్పు వెలువడింది. కాగా ఈ తీర్పుపై తాను నిరాశ చెందినట్లు స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జన్ వ్యాఖ్యానించారు. అయినా తీర్పును గౌరవిస్తామని చెప్పారు.