Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : పశ్చిమ నేపాల్లోని దాదెల్ధురా నియోజకవర్గం నుండి వరుసగా ఏడవసారి ప్రధాని షేర్ బహదూర్ దేబా (77) భారీ మెజారిటీతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధి, సమీప ప్రత్యర్ధి సాగర్ ధాకల్ (31)కు 1302 ఓట్లు రాగా, దేబాకు 25,534ఓట్లు లభించాయి. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ పార్లమెంటరీ ఎన్నికల్లోనూ దేబా ఎన్నడూ ఓడిపోలేదు. దేబా వంటి సీనియర్లు ఇక విశ్రాంతి తీసుకుని తన వంటి యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని ధాకల్ అన్నారు. ఐదేళ్ళ క్రితం ఇదే విషయమై బిబిసిలో జరిగిన చర్చలో ఆయన దేబాతో ఘర్షణ పడ్డారు. ప్రస్తుతం దేబా ఐదవసారి ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతినిధుల సభలో పాలక నేపాలీ కాంగ్రెస్కు పది సీట్లు లభించాయి. మరో 46స్థానాల్లో ఆధిక్యంలో వున్నారు. కె.పి.ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్కు మూడు సీట్లు రాగా, 42స్థానాల్లో ఆధిక్యతలో వుంది. ఆదివారం జరిగిన ఎన్నికలకు సోమవారం నుండి ఓట్ల లెక్కింపు జరుగుతోంది.