Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా : గతనెల్లో జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సనారో సవాలు చేశారు. ఈ మేరకు ఆయన ఫెడరల్ ఎన్నికల కోర్టు (టిఎస్ఇ)లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫలితాలను అసాధారణ రీతిలో పరిశీలించాల్సిందిగా ఆయన కోరారు. ఆ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్ధి, వామపక్ష నేత లూలా డసిల్వా విజయం సాధించారు. లూలా గెలుపును టిఎస్ఇ ధృవీకరించింది. బ్రెజిల్ రాజకీయ ప్రముఖులు, అమెరికా సహా అంతర్జాతీయ దేశాలు కూడా గుర్తించాయి. కానీ బోల్సనారో వర్గం మాత్రం ఆ ఫలితాలను అంగీకరించడం లేదు. ఓటింగ్ యంత్రాల్లో లోపాలు వున్నాయని వీటి ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడవచ్చని ఆ ఫిర్యాదు పేర్కొంది. కాగా దీనిపై వ్యాఖ్యానించడానికి కోర్టు వెంటనే స్పందించలేదు.