Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సమ్మెను నివారించేందుకు యత్నాలు
వాషింగ్టన్ : తమ డిమాండ్ల సాధన కోసం రైల్వే కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్ చిట్టచివరి యత్నంగా వారితో చర్చలు జరిపారు. రైల్వేలోనే అతిపెద్ద యూనియన్ అయిన స్మార్ట్-టిడి సభ్యులు వైట్‌హౌస్ రూపొందించిన ఒప్పందాన్ని సోమవారం తిరస్కరించారు. దాంతో మంగళవారం బైడెన్ వారితో చర్చలు జరిపారని వైట్‌హౌస్ ధృవీకరించింది. రైల్వే సమ్మెను ఎలాగైనా నివారించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం వుందని, పరిస్థితి తీవ్రతను గుర్తించే స్వయంగా అధ్యక్షుడే రంగంలోకి దిగారని తెలిపింది. నాసిరకమైన ఒప్పందాన్ని కార్మికులపై రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యూనియన్ నేతలు విమర్శిస్తున్నారు. రెండు నెలల క్రితం కూడా ఇదే తరహా పరిస్థితి ఎదురైంది. అప్పుడు బైడెన్ స్వయంగా జోక్యం చేసుకుని సెప్టెంబరు 16న సమ్మె తేదీకి ముందుగానే ఒప్పందం కుదుర్చుకోగలిగారు. బృహత్తర స్థాయిలో నిరంతంగా జరిగిన చర్చల కారణంగా సెప్టెంబరు 15న ఉదయమే బైడెన్ పరిష్కార ఒప్పందాన్ని ప్రకటించారు. జాతీయ సమ్మెను విజయవంతంగా నివారించగలిగానని చెప్పుకున్నారు.