Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్మీ తదుపరి చీఫ్‌గా జనరల్ అసిమ్ మునిర్ను ఆ దేశ ప్రధానమంత్రి షెహబజ్ షరీఫ్ నియమించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మరియం ఔరంగజేబ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జవేద్ భజ్వా ఆరేళ్ల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. కాగా ఆర్మీ చీఫ్‌గా జనరల్ అసిమ్ మునీర్‌ను నియమించడం వల్ల దేశంలో ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు బద్ధ విరోధిగా అసిమ్ మునీర్‌కు పేరు ఉంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్మీ గూఢచారి విభాగం ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి నుంచి మునీర్‌ను తొలగించారు. ఆ పదవిలో తన సన్నిహితుడిని నియమించుకున్నారు. ఈ పరిస్థితుల్లో అసిమ్ నియామకం ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. పాకిస్థాన్‌లో దేశ రాజకీయాలపై ఆర్మీ తీవ్ర ప్రభావం చూపిస్తుందనే సంగతి తెలిసిందే.