Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరంలోని సోకోల్ జిల్లాలో ఫైడల్ కాస్ట్రో స్క్వేర్లో మంగళవారం మూడు మీటర్ల ఎత్తైన కాస్ట్రో కాంస్య విగ్రహాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్ ఆవిష్కరించారు. చారిత్రక క్యూబా విప్లవనేత స్మృత్యర్ధం ఈ విగ్రహావిష్కరణ జరిగింది. వ్యక్తిత్వ ఆరాధనను కాస్ట్రో తీవ్రంగా వ్యతిరేకించేవారు. క్యూబాలో ఆయన పేరుతో వీధులు, భవనాలు, సంస్థలు లేదా ప్రాంతాలు ఏవీ లేవు. విగ్రహాలు, అధికారిక ఫోటోలు, లేదా వీధుల పేర్ల రూపంలో జీవించి వున్న విప్లవ నేతను ఆరాధించరాదని 2003లో ఒక ప్రసంగంలో కాస్ట్రో స్పష్టం చేశారు. ఈ దేశ నేతలందరూ కూడా కేవలం మానవులే, దేవుళ్లు కాదని వ్యాఖ్యానించారు. అందువల్ల క్యూబాకు వెలుపల మాత్రమే ఆయన పేరుతో స్మారకాలు వుంటాయి. ఫైడల్ వారసత్వాన్ని గౌరవిస్తూ మాస్కోలో చేపట్టిన ఈ కార్యక్రమం మారిన రష్యా వైఖరికి అత్యంత ప్రతీకగా నిలిచింది.