Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోల్సోనారో పార్టీకి 43లక్షల డాలర్ల జరిమానా
శావోపొలో : ఇటీవల జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలను రద్దుచేయాలంటూ అధ్యక్షుడు జేర్ బోల్సనారో, ఆయన పార్టీ చేసిన విజ్ఞప్తిని ఫెడరల్ ఎన్నికల కోర్టు (టిఎస్‌ఇ) అధ్యక్షుడు అలెగ్జాండర్ డీ మోర్సే తిరస్కరించారు. ఎన్నికల ఫలితాలను ఇలా సవాలు చేయడం వల్ల బోల్సనారో లిబరల్ పార్టీ ఇబ్బందులు పడే అవకాశం వుందంటూ పరోక్షంగా ఆయన తన రూలింగ్‌లో ప్రస్తావించారు. కాగా అక్టోబరు 30న జరిగిన రెండో రౌండ్‌పై తమ ఆడిట్లో కొన్ని ఓటింగ్ యంత్రాల్లో సరిదిద్దుకోలేని తప్పులు జరిగిన సంకేతాలను కనుగొన్నామని లిబరల్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తన ఫిర్యాదులో వివరించింది. అయితే వాటిని నిర్ధారించే ఆధారాలను అందచేయాల్సిందిగా కోర్టు కోరింది. కానీ ఎలాంటి ఆధారాలు సమర్పించకుండా, నిరాధారమైన, తప్పుడు ఫిర్యాదు చేశారంటూ బోల్సనారో పార్టీకి 22.9 మిలియన్ రియాన్లు (43లక్షల డాలర్లు) జరిమానాగా సుప్రీంకోర్టు విధించింది. అక్టోబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సోనారో పరాజయం చెందిన సంగతి తెలిసిందే.