Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగైన వేతనాల కోసం ఆందోళన
వాషింగ్టన్ : బహుళ జాతి రిటైల్ దిగ్గజం అమెజాన్‌పై ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర నిరసన చేపట్టారు. తమకు మెరుగైన వేతనాలు చెల్లించాలని శుక్రవారం 40 దేశాల్లో ఆందోళనలు నిర్వహించారు. మెరుగైన వేతనాలు, ఆరోగ్యకర పని పరిస్థితుల కోసం 'మేక్ అమెజాన్ పే' నినాధంతో వేలాది కార్మికులు, సిబ్బంది శుక్రవారం సమ్మెకు దిగారు. అమెరికా, బ్రిటన్, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర దేశాల ఉద్యోగులు 'బ్లాక్ ఫ్రైడే సేల్స్' పేరుతో ఆందోళన చేపట్టారు. బ్రిటన్‌లోని అమెజాన్ గిడ్డంగుల (వేర్ హౌజ్) ముందు జిఎంబి యూనియన్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఫ్రాన్స్, జర్మనీ యూనియన్స్ సిజిటి, వెర్.డి లతో పాటు యూరప్ మార్కెట్లోని 18 మేజర్ కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి. ఈ ఆందోళనకు అంతర్జాతీయ కార్మిక సంఘాలు నేతృత్వం వహించగా.. పర్యావరణం, సామాజిక సంస్థలు మద్దతు ప్రకటించాయి.అమెజాన్ కార్మికులు చాలా ఎక్కువగా పని చేస్తున్నారని.. చెల్లింపులు మాత్రం సరిపడ లేవని జిఎంబి సీనియర్ ఆర్గనైజర్ అమండ గేరింగ్ పేర్కొన్నారు. మెరుగైన చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. గంటకు కనీస వేతనం 10.50 పౌండ్ల నుంచి 15 పౌండ్లకు పెంచాలని కార్మికులు, సెక్యూరిటీ గార్డులు డిమాండ్ చేశారు. అధిక ద్రవ్యోల్బణంతో తమ కుటుంబాల బడ్జెట్లు పెరిగి పోయాయని సరిపడ వేతనాలు చెల్లించాలన్నారు. బ్రిటన్‌లో 75వేల మంది పైగా అమెజాన్ రిటైల్‌కు పని చేస్తున్నారు. కాగా ఇక్కడ వస్తున్న ఆదాయాలు, లాభాలతో పోల్చితే తమకు అత్యల్ప వేతనాలు ఇస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.పెరుగుతున్న జీవన వ్యయానికి తగినట్లుగా మెరుగైన వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అమెజాన్‌లోని ఆమోదయోగ్యం కాని, అసురక్షిత పనిపరిస్థితులను వెంటనే నిలిపివేయాలని యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ జనరల్ సెక్రటరీ క్రిష్టీ హాఫ్మాన్ పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు మెరుగైన ఉద్యోగుల కోసం కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉత్పాదకతను కంప్యూటర్ల ద్వారా పరిశీలించే విధానంపై జర్మనీలోని వెర్.డి అమెజాన్ కమిటీ అధ్యక్షురాలు మోనికా డి సిల్వెస్ట్రే ఆందోళన వ్యక్తం చేశారు. యాంత్రిక పద్ధతి విధానంతో కార్మికులపై ఒత్తిడి అధికమవుతుందన్నారు. అధ్యక్షురాలు మోనికా డి సిల్వెస్ట్రే ఆందోళన వ్యక్తం చేశారు. యాంత్రిక పద్ధతి విధానంతో కార్మికులపై ఒత్తిడి అధికమవుతుందన్నారు.