Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొగదిషు : సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు హోటల్‌ను ఆధీనంలోకి తీసుకోగా, భద్రతా అధికారులు విజయవంతంగా పరిష్కరించారు. ఈ క్రమంలో 8మంది పౌరులు మరణించారని జాతీయ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో అల్‌ఖైదాకి చెందిన కొందరు తీవ్రవాదులు విల్లా రోజ్ హోటల్‌ను ముట్టడించి దాడులు ప్రారంభించారు. తుపాకులు, పేలుళ్లతో ఆ హోటల్ దద్దరిల్లిపోయింది. దాడులు ప్రారంభమైన దాదాపు 21 గంటల తర్వాత విల్లా రోజ్లో దాడులను అణచివేశామని పోలీసు ప్రతినిధి సాదిక్ దూదిషె తెలిపారు. ఈలోగా హోటల్లో బస చేసిన వారిలో 8మందిని తీవ్రవాదులు హత్య చేశారు. హోటల్లో వున్న మరో 60మందిని కాపాడగలిగామని భద్రతా బలగాలు తెలిపాయి. భద్రతా దళాలకు చెందిన సభ్యుడు ఒకరు మరణించారు. అధ్యక్ష భవనానికి కొద్ది గజాల దూరంలో వున్న ఈ హోటల్లో ఎక్కువగా ప్రభుత్వాధికారులు, ప్రముఖులు దిగుతూ వుంటారు. సోమాలియా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి 15 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న అల్ షాబాబ్ ఈ దాడికి తనదే బాధ్యత అని ప్రకటించింది.