Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : ఈ వారంలో కైరోలో అమెరికాతో జరగాల్సిన అణ్వాయుధ చర్చలను రష్యా వాయిదా వేసిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ వాయిదాకు గల కారణమేంటనేది ఇరు పక్షాలూ వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుండి డిసెంబరు 6వరకు కైరోలో ఇరు దేశాల అధికారులు చర్చలు జరపాల్సి వుంది. కొత్త స్టార్ట్ అణ్వాయుధాల కుదింపు ఒప్పందం కింద తనిఖీలను పునరుద్ధరించడంపై వీరు చర్చించాల్సి వుంది. కోవిడ్ కారణంగా 2020 మార్చిలో ఈ చర్చలు రద్దయ్యాయి. ఈ సమావేశాన్ని రష్యా ఏకపక్షంగా వాయిదా వేసింది. కొత్త సమావేశపు తేదీలను త్వరలో ప్రతిపాదిస్తుందని రష్యా తెలియచేసినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇంతకుమించి సమాచారం వెల్లడించలేమని చెప్పారు. ఒప్పందాన్ని సుస్థిరతా సాధనంగా చూడాలంటే తనిఖీలు పునరుద్ధరించడానికి ప్రాధాన్యతనివ్వాల్సి వుందని, అందువల్ల సాధ్యమైనంత త్వరలో చర్చలు జరపడానికి సిద్ధంగా వున్నామని ఆ ప్రతినిధి చెప్పారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.