Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్
లండన్ : ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సంబంధాలను పెంపొందించుకోవడంపై విస్తృతమైన దృష్టి పెట్టే ప్రయత్నంలో భాగంగా భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాని (ఎఫ్టీఏ) కి బ్రిటన్ కట్టుబడి వుందని బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ పునరుద్ఘాటించారు. లండన్ మేయర్ ఇచ్చిన విందు సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ, పారదర్శకత విలువలను పెంపొందించడానికి తాము కట్టుబడి వున్నామని చెప్పారు. గత నెల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన ప్రధాన విదేశాంగ విధాన ప్రకటన చేశారు. బ్రిటీష్ విలువలకు, ప్రయోజనాలకు చైనా నుంచి సవాలు ఎదురవుతోందనీ, ఇక్కడ భిన్నంగా వ్యవహారాలు చక్కబెడతామని హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రాకముందు, ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల్లో తాను పెట్టుబడులు పెట్టానని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అవకాశాలు బలంగా వున్నాయని సునాక్ వ్యాఖ్యానించారు. 2050కల్లా, ఇండో-పసిఫిక్ ప్రాంతం సగానికన్నా ఎక్కువగానే అంతర్జాతీయ అభివృద్ధి ఫలితాలను పంపిణీ చేయగలదని అదే సమయంలో యూరప్, ఉత్తర అమెరికా కలిపినా 25శాతం వుండదని అన్నారు. అందువల్లే పసిఫిక్ ఖండాంతర వాణిజ్య ఒప్పందంలో తాము చేరుతున్నామని సునాక్ చెప్పారు.