Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) మరణించినట్టు స్థానిక మీడియా తెలిపింది. లుకేమియా, పలు అవయవాలు వైఫల్యం చెంద డంతో జియాంగ్ బుధవారం మధ్యాహ్నం షాంగైలో మర ణించి నట్టు క్షిన్హువా తెలిపింది. ఆయన మృతిని ప్రకటిస్తూ అధికార కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంట్, మంత్రివర్గం, సైన్యం జారీ చేసిన ఓ లేఖను కూడా విడుదల చేసింది. 'కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మృతి పార్టీకి, సైన్యానికి, ప్రజలకు తీరని లోటని.. ఆయన మృతి తీవ్ర వేదనను మిగిల్చిందని' ఆ లేఖలో పేర్కొంది. జియాంగ్ అత్యుత్తమ నేత, గొప్ప మార్క్సిస్ట్, సైనిక వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, కమ్యూనిస్టు పోరాట యోధుడిగా ప్రభుత్వం పేర్కొంది. 1989లో తియన్మార్ స్క్వేర్ ఉద్యమం సమయంలో చైనా ప్రభుత్వం అభద్రతలో పడకుండా కాపాడారని, ఆర్థికవృద్ధిని సాధించేందుకు కృషి చేశారని పేర్కొంది. మార్కెట్ ఆధారిత సంస్కరణల పున రుద్ధరణ, 1997లో బ్రిటీష్ పాలన నుంచి హాంకాంగ్‌ను తిరిగి తీసుకురావడం, 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో చైనా ప్రవేశం వంటి చారిత్రాత్మక ఘట్టాల్లో ఆయన కృషి ఉందని ఆ లేఖలో తెలిపింది.