Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసిహెచ్ఆర్కు అసాంజె లేఖ
బ్రస్సెల్స్ : తనను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఇచ్చిన అనుమతిని నిలువరించాలని కోరుతూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలి యన్ అసాంజె యురోపియన్ మానవ హక్కుల కోర్టు (ఇసిహెచ్ఆర్)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ అందచేశారు. అసాంజె మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఆయనను అమెరికాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందంటూ తొలుత బ్రిటన్ న్యాయమూర్తి తిరస్కరించారు. కానీ అమెరికా అధికారులు పలు రకాలు గా హామీలివ్వడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్పగింతకు అనుమతించింది. దీంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లండన్ హైకోర్టులో అసాంజె అప్పీల్ చేశారు. వచ్చే ఏడాది దీనిపై విచారణ జరుగుతుందని భావిస్తున్నారు. కాగా ఈ కేసును ఇసిహెచ్ఆర్ పరిశీలించాల్సిన అవసరం లేదని, బ్రిటన్లోనే ఇది పరిష్కారం కావాలని అసాంజె భాగస్వామి స్టెల్లా వ్యాఖ్యానించారు.