Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎనిమిదో స్థానంలో భారత్. యూఎస్ రీసెర్చ్
న్యూయార్క్:2022- 2023లో సామూహిక హత్యలు జరిగే ప్రమాదం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉందని ఓ నివేదిక తెలిపింది. హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉన్న దేశాలపై యూఎస్ రీసెర్చ్ సంస్థ ''ఎర్లీ వార్నింగ్'' అధ్యయనం చేపట్టింది. 2022-23లో భారత్లో సామూహికంగా హత్యలు జరిగే అవకాశం 7.4 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం 162 దేశాల్లో ఈ ఏడాది జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా, యెమెన్ రెండోస్థానంలో, మయన్మార్ మూడోస్థానంలో, ఇథియోపియా ఐదో స్థానంలో, నైజీరియా ఆరో స్థానంలో, ఆఫ్ఘనిస్థాన్ ఏడో స్థానంలో నిలిచాయని పేర్కొంది.నివేదిక కోసం దేశాల భౌగోళిక ప్రాంతం, జనాభా, సామాజిక ఆర్థిక చర్యలు, ఆయా దేశాల ప్రభుత్వాల ఆంక్షలు, మానవహక్కుల స్థాయిలు, గతంలో హింసాత్మక సంఘర్షణ రికార్డులను విశ్లేషించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను గత నెల విడుదల చేసింది.దేశంలోని ముస్లిం మైనారిటీల పట్ల కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుతం ఎలా వివక్ష చూపుతుందనే అంశాలను ఈ నివేదిక హైలెట్ చేసింది. డిసెంబర్ 2021 నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు సామూహిక హత్యలకు పిలుపునిచ్చేలా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల అనే క రాష్ట్రాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా చేపట్టిన ఊరేగింపుల్లో ముస్లిం వ్యతిరేక నినాదాలు, మసీదులను అపవిత్రం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. హింసాత్మక ఘటనలకు ప్రతిస్పందనగా రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లింల నివాసాలు, ఆస్తులను బుల్డోజర్ ధ్వంసం చేశారు.