Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : పశ్చిమ రష్యాలోని కుర్క్క్ నగర వైమానిక క్షేత్రంపై ద్రోణ్ దాడి జరిగిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. రియాజన్, సరతొవ్ ప్రాంతాల్లోని రెండు స్థావరాలపై ద్రోణ్ దాడులు జరిగిన రోజే ఈ దాడి కూడా చోటు చేసుకుంది. కుర్క్క్ నగరం ఉక్రెయిన్‌కి సమీపంగా వుంటుంది. కానీ రియాజన్, సరతొవ్ ప్రాంతాలు మాత్రం రష్యా లోపలే వుంటాయి. సరిహద్దుకు దాదాపు 700కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతాలు వున్నాయి. ద్రోణ్ దాడి ఫలితంగా, కుర్స్క్ వైమానిక క్షేత్రంలో గల చమురు ట్యాంక్‌కు నిప్పంటుకుంది. అయితే మంటలు ఆ ప్రాంతానికే పరిమితమయ్యాయని కుర్స్క్ ప్రాంత గవర్నర్ రోమన్ స్తారొవొత్ మంగళవారం ఉదయం తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని తెలిపారు. సోమవారం, పలు సోవియట్ తయారీ జెట్ ద్రోణ్‌లు తక్కువ ఎత్తులోనే రియాజన్ ప్రాంతంలోని డైగిలెవో వైమానిక క్షేత్రం, సరతొవ్ ప్రాంతంలోని ఏంగెల్స్ ఎయిర్‌ఫీల్డ్‌పై పై చక్కర్లు కొట్టాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మానవ రహిత వాహనాలను కనుగొన్నామని, వెంటనే తమ బలగాలు వాటిని కూల్చివేశాయని మిలటరీ తెలిపింది. అయితే వాటి శిధిలాల వల్ల రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ముగ్గురు వైమానిక సిబ్బంది గాయపడ్డారని పేర్కొంది.