Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారం చెల్లింపులో వెనుకడుగు
న్యూయార్క్ : ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ఇటీవల తొలగించిన తమ 11వేల మంది ఉద్యోగులను దారుణంగా మోసం చేస్తోంది. ఉద్వాసన సమయంలో వారందరికీ పలు నగదు ప్రయోజనాలతో కూడిన పరిహార ప్యాకేజీని ఇస్తామన్న హామీని తుంగలో తొక్కిందని రిపోర్టులు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన పరిహారాన్ని అందించడం లేదని, తొలుత కొందరు ఉద్యోగులను తొలగించిన అనంతరం వారికి ఇచ్చిన పరిహార ప్యాకేజ్ కంటే తమకు తక్కువ ప్రయోజనాలు వర్తింపచేశారని పలువురు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ 16 వారాల బేస్ సెవరెన్స్ పేమెంట్‌తో పాటు ప్రతి ఏడాది సర్వీస్‌కు రెండు వారాల అదనపు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది. వైద్య బీమా మద్దతును ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆరు నెలల పాటు కల్పించనున్నట్లు మెటా తెలిపింది. హామీకి భిన్నంగా ప్రస్తుతం కేవలం 8 వారాల బేస్ పే చెల్లిస్తోందని, కోబ్రా ఇన్సూరెన్స్‌ను మూడు నెలలకే పరిమితం చేస్తున్నట్లు తొలగింపబడిన ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మెటా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.