Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: ఇటీవల కన్నుమూసిన చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్‌కు మంగళవారం నిర్వహించిన సంస్మరణ సభలో అధ్యక్షుడు జిన్‌పింగ్ నివాళులర్పించారు. చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో జియాంగ్ జెమిన్ పాత్రను ప్రశంసించారు. ఆయన కీర్తి, విజయం, ప్రజాదరణ ఎల్లప్పుడూ చరిత్రలో భాగంగా ఉంటాయనీ, తరతరాలుగా ప్రజల హృదయాలలో నిలిచి ఉంటుందని జిన్‌పింగ్ ప్రశంసించారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో మంగళవారం జియాంగ్ స్మారక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిన్‌పింగ్ సహా సీపీసీ మాజీ ప్రీమియర్ వెన్ జియాబావొ, జియాంగ్ భార్య వాంగ్ యెపింగ్, ఉన్నత సైనికాధికారులు హాజరయ్యారు. గతనెల 30న షాంఘైలో లుకేమియా, ఇతర వ్యాధులతో జియాంగ్ మరణించిన సంగతి తెలిసిందే. జియాంగ్ 1989 నుండి 2002 వరకు అధ్యక్షునిగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) జనరల్ సెక్రటరీగా కొనసాగారు. ప్రధాన ఆర్థిక శక్తిగా చైనా ఎదుగుదలను పర్యవేక్షించడం, క్లిష్ట సమయాల్లో కఠిన నిర్ణయాల ద్వారా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి మార్గనిర్దేశం చేశారు.