Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రియాద్ : సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్ శుక్రవారం అరబ్ నేతలతో సమావేశంలో పాల్గొన్నారు. సౌదీ అరేబియాతో అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు. సౌదీ అరేబియా పర్యటన కోసం బుధవారం రియాద్‌కు జిన్‌పింగ్ చేరుకున్నారు. పర్యటనలో మూడో రోజు, చివరి రోజైన శుక్రవారం జిన్‌పింగ్ కీలక సమావేశాలు నిర్వహించారు. సౌదీ రాజు సల్మాన్, యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌తో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో వాతావరణ మార్పులు ఎదుర్కొ వడంలో 'మూలాల కంటే ఉద్గారాలపై దృష్టి సారించడం' గురించి ప్రస్తా వించారు. అలాగే గృహ నిర్మాణం నుంచి చైనీస్ భాషా బోధన వరకూ 46 ఒప్పందాలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. అలాగే, ఉమ్మడి ప్రకటన అన్ని రంగాల్లో సంయుక్త చర్యను కొనసాగించడం, రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క చట్రంలో సంబంధాలను బలో పేతం చేయడం, నూతన లక్ష్యాలు చేరుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. కాగా, కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌కు ఇది మూడో విదేశీ పర్యటన మాత్రమే.