Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా మండలి తీర్మానం
- ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు
న్యూయార్క్: ఆంక్షల బారి నుంచి మానవతాసాయాన్ని మినహాయించాలని కోరుతూ భద్రతా మండలి తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై శుక్రవారం జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన తీవ్రవాద గ్రూపులు ఇటువంటి పరిస్థితులను పూర్తిగా అవకాశంగా తీసుకుంటాయని, నిధులను సేకరించి, తీవ్రవాదులను రిక్రూట్ చేసుకోవడానికి వారికి వెసులుబాటు వుంటుందని భారత్ పేర్కొంది. ప్రస్తుతం 15మంది సభ్యులు గల మండలికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. అమెరికా, ఐర్లాండ్ శుక్రవారం పెట్టిన ఈ తీర్మానంపై మండలిలో ఓటింగ్ జరిగింది. మానవతా చర్యలకు, కార్యకలాపాలకు మినహాయింపునిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాలని ఆ తీర్మానం కోరుతోంది.