Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022లో మీడియా ప్రతినిధులపై 30 శాతం పెరిగిన హింస
బ్రస్సెల్స్ : గత ఏడాది కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 67 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారని, 375 మంది జైలు పాలయ్యారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌జె) పేర్కొంది. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం, హైతీలో శాంతిభద్రతలు దెబ్బ తినడం, మెక్సికోలో క్రిమినల్ గ్యాంగుల బీభత్సం వల్ల గత ఏడాదితో పోలి స్తే 30 శాతం హత్యలు పెరిగాయని తాజా నివేదికలో ఐఎఫ్‌జె తెలిపింది. గత ఏడాది 47 మంది జర్నలిస్టులు హత్యకు గురవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 67కు పెరిగింది. గత ఏడాది 365 మంది జైలు పాలవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 375కు చేరిందని ఐఎఫ్‌జె ప్రధాన కార్యదర్శి ఆంథోని బెలెంజర్ పేర్కొన్నారు. స్వేచ్ఛా జర్నలిజాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని, అణచివేసే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. అల్ జజీరా జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లేV్‌ా పాలస్తీనా శరణార్థి శిబిరం నుంచి రిపోర్టింగ్ చేస్తుండగా ఇజ్రాయిల్ కాల్పులు జరిపి హత్య చేసిన ఘటనపై దర్యాప్తు చేయాలని అరబ్ నెట్ వర్క్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును కోరింది.