Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : చైనా-అరబ్ దేశాలు 200కు పైగా భారీ ప్రాజెక్టులు చేపట్టాయని, ఈ ప్రాజెక్టులతో 200 కోట్లమందికి పైగా ప్రజలు లబ్ధి పొందారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చైనా, అరబ్ దేశాల బెల్ట్ అండ్ రోడ్ కోపరేషన్ నిర్మాణత్మాకంగానూ, ఫలవంతంగానూ మారిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. బీజింగ్‌లో ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 'చైనా, అరబ్ దేశాలు సంయుక్తంగా మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఇతర రంగాల్లో 200 కంటే భారీ స్థాయి ప్రాజెక్టులను చేపట్టాయి. దీంతో రెండు దేశాలకు చెందిన 200 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు' అని చెప్పారు. ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ జరుగుతున్న ఖతార్‌లోని లుసైల్ స్టేడియం, ఈజిప్టులోని మొదటి విద్యుతీకరణ రైల్వే లైన్ కూడా చైనా-అరబ్ దేశాల మధ్య సహకారంతో నిర్మించినవే అని ఆమె గుర్తు చేశారు. అత్యున్నత నాణ్యత కలిగిన బెల్ట్ అండ్ రోడ్ కోపరేషన్ మరింతగా పెరిగితే అరబ్ దేశాల ప్రజలకు, ఇతర ప్రపంచ ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని చైనా నమ్మకంగా ఉందని మావో నింగ్ తెలిపారు.