Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్, విమాన సర్వీసులకు అంతరాయం
లండన్ : క్రిస్మ స్ వేళ బ్రిటన్లో పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నది. ఈ సమ్మెలో బస్సు, రైల్వే, విమానం, అంబులెన్స్, నర్సింగ్, పోస్టల్, టీచింగ్ సిబ్బంది సహా వివిధ విభాగాలకు చెందిన రెండుల లక్షలకు పైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఫలితంగా అన్ని రకాల సేవలు బ్రిటన్లో నిలిచిపోనున్నాయి. సమ్మె కారణంగా స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. గత 30 ఏండ్లలో ఇదే అతిపెద్ద సమ్మెగా భావిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఈ సమ్మె జరుగుతుండటంతో ప్రజలు ఎక్కడికీ వెళ్లాలేక, ఏమీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్కు ఈ సమ్మె ఒక ఛాలేంజ్గా నిలించిందని రాజకీయ, ఆర్థిక పరిశీలకులు భావిస్తున్నారు.