Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిమా : పెరూ మాజీ అధ్యక్షులు పెడ్రో క్యాస్టిల్లోపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటీషన్ను ఆ దేశంలోని మూడో రాజ్యాంగ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ ఆమోదయోగ్యం కాదని తెలిపింది. మాజీ అధ్యక్షులు క్యాస్టిల్లోను పోలీసులు నిర్భంధించిన విధానం సరికాదని ఆరోపిస్తూ క్యాస్టిల్లో తరుపు న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్ ఆమోదయోగ్యం కాదని జడ్జి జాన్ పరేడెస్ ప్రకటించారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో క్యాస్టిల్లో తక్షణ విడుదల ప్రశ్నార్థకరంగా మారింది. క్యాస్టిల్లోను తక్షణమై విడుదల చేయాలని దేశంలో సామాజిక సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 15న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. క్యాస్టిల్లో అరెస్టుకు నిరసనగా రాజధాని లిమాతో సహా అనేక పట్టణాల్లో భారీఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. బుధవారం ప్రతిపక్షం ఆధీనంలో ఉన్న పెరూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి పెడ్రో క్యాస్టిల్లోను అధ్యక్ష పదవిలోంచి దించివేశారు. అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన కొన్ని గంటల్లోనే పోలీసులు క్యాస్టిల్లోను అరెస్టు చేశారు.