Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : భారత్, నేపాల్ మిలటరీల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు శుక్రవారం నుంచి ఇరు దేశాలు సంయుక్త మిలటరీ శిక్షణా విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు భారత సైన్యానికి చెందిన బృందం బుధవారం నేపాల్ చేరుకుంది. నేపాల్-భారత్ సరిహద్దుకు సమీపంలో రూపాన్దెహిలోని సాల్జాండి వద్ద ఈ మిలటరీ విన్యాసాలు జరగనున్నాయి. 16వ సంయుక్త మిలటరీ విన్యాసాల కోసం భారత సైనిక బలగాలు చేరుకున్నాయి. వీటితో రెండు సైన్యాల మధ్య స్నేహ బంధం మరింత ధృడమవుతుందని ఖాట్మండులోని భారత ఎంబసీ కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. 15వ విన్యాసాల్లో ఇరు పక్షాలకు చెందిన 650మంది సైనికులు పాల్గొన్నారు. సెప్టెంబరులో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నేపాల్లో పర్యటించారు. ఆ పర్యటనా కాలంలో నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ పదవిని పాండేకి ప్రదానం చేశారు.