Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: భారత మైక్రో బ్లాగింగ్ వేదిక 'కూ' ఖాతాను ట్విట్టర్ సంస్థ నిలిపివేసింది. వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి కూ ట్విట్టర్లో ఏర్పాటు చేసుకున్న తన ఖాతాను శనివారం సస్పెండ్ చేసింది. ఇంతక్రితం డాక్సింగ్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో పలువురు జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ రద్దు చేసింది. ఇందులో ట్విటర్‌కు పోటీగా వచ్చిన మాస్టోడాన్తో పాటు 'కూ' సంస్థకు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయి. తమ వినియోగదారులు 5 కోట్లకు చేరారని ఇటీవలే కూ సంస్థ సహ వ్యవస్థాపకులు మయాంక్ పేర్కొన్నారు.