Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డబ్లిన్: భారతీయ మూలాలు ఉన్న లియో వరాడ్కర్(42) ఐర్లాండ్ ప్రధానిగా శనివారం రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్లో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అధికారం పంచుకుంటున్నాయి. కూటమిలో ముందే కుదిరిన ఒప్పందం మేరకు ఇంతకాలం ప్రధానిగా ఉన్న మైకెల్ మార్టిన్ రాజీనామా చేసి లియో వరాడ్కర్కు బాధ్యతలు అప్పగించారు. వరాడ్కర్ తండ్రి వైద్యుడు. భారత్లో పుట్టి ఐర్లాండ్లో స్థిరపడ్డారు. తల్లి ఐర్లాండ్ దేశస్థురాలు. నర్సుగా పనిచేశారు. లియో వరాడ్కర్ ఐర్లాండ్లోనే జన్మించారు. వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటిసారి ప్రధాని అయినప్పుడు లియో వయసు కేవలం 38 ఏండ్లు. ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాను స్వలింగ సంపర్కుడినని లియో 2015లో బహిరంగంగా ప్రకటించారు.