Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : రష్యాకి చెందిన వేగర్ మిలటరీ గ్రూప్‌కు సాంకేతిక ఎగుమతులపై బైడెన్ ప్రభుత్వం కొత్త ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా జరిపే యుద్ధంలో పోషించిన పాత్రకు గానూ ఆ గ్రూపు సరఫరాలను మరింత దెబ్బతీసే ప్రయత్నంలో అమెరికా ఈ చర్య తీసుకుంది. ఉక్రెయిన్‌లోని క్రిమియా ప్రాంతాన్ని రష్యా 2017లో తమలో కలిపేసుకున్న తర్వాత వేగర్ గ్రూపును వాణిజ్య బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. ఇప్పుడు ఆ సంస్థను మిలటరీ ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా ముద్ర వేశారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికన్ సాంకేతికతతో తయారైన పరికరాలు ఆ సంస్థకు అందుబాటులోకి రావడంపై కొత్తగా ఆంక్షలు విధించారు. ఉక్రెయిన్‌వ్యాప్తంగా అత్యాచారాలకు, మానవ హక్కుల దుర్వినియోగానికి వేగర్ గ్రూపు పాల్పడుతోందని అమెరికా వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అలాన్ ఎస్టీవ్స్ విమర్శించారు. బుధవారం వైట్‌హౌస్‌లో బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ అయిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా ఈ చర్య తీసుకున్నారు. కాగా, ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్ అయిన వేగర్ గ్రూపునకు క్రెమ్లిన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి.