Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో భారత్, చైనాల మధ్య ఘర్షణల నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి ఆదివారం స్పందించారు. స్థిరమైన, పటిష్టమైన సంబంధాల దిశగా భారత్తో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా ఉందని అన్నారు. దౌత్య సైనిక మార్గాల ద్వారా చర్చలు కొనసాగించాయని, సరిహద్దు ప్రాంతాలలో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. స్థిరమైన, బలమైన వృద్ధి దిశగా భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నట్లు చైనా విదేశాంగ శాఖ వెబ్సైట్ ఓ ప్రకటన విడుదల చేసింది.