Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిక్కుకున్న 18మంది కార్మికులు
గ్జిన్జియాంగ్: క్రిస్మస్కు ముందు రోజు చైనాలో బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది. 18మంది కార్మికులు గనిలో చిక్కుకుపో యారు. వాళ్లను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గ్జిన్జియాంగ్లోని ఇనింగ్ కౌంటీలో ఉన్న బొగ్గు గని శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ సమయంలో 40 మంది కార్మికులు గనిలో ఉన్నారు. వీళ్లలో 22 మందిని రెస్క్యూ బందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి అని గ్జిన్హు వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. ఈ బంగారు గని కజకిస్థాన్ సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇక కింజారు ప్రాంతంలో సెప్టెంబర్లో బొగ్గు గని కూలిన ప్రమాదంలో 19 మంది చనిపోయారు. పోయిన ఏడాది డిసెంబర్లో షాంక్సీ రాష్ట్రంలో బొగ్గు గని కూలిన సంఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు విడిచారు. ప్రపంచంలో ఎక్కువ మైనింగ్ పరిశ్రమలు ఉన్నది చైనాలోనే. పోయిన ఏడాది 370 లక్షల టన్నుల బంగారాన్ని చైనా వెలికితీసింది. అంతేకాదు బొగ్గు ఉత్పత్తిలోనూ ఆ దేశం మొదటిస్థానంలో ఉంది.