Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సువా(ఫిజీ): మాజీ మిలటరీ కమాండర్ సిటివెని రబుకా శనివారం ఫిజీ ప్రధానిగా నియమితులయ్యారు. తాను అధికారంలోకి రాకుండా నిలువ రించేందుకు ప్రస్తుత ప్రభుత్వం అనేక అల్లర్లకు, కుట్రలకు పాల్పడిందని రబుకా విమర్శించారు. 2006లో కుట్ర ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి ఆ తర్వాత ఏడాదికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఫ్రాంక్ బైనిమరామా స్థానంలో రబుకా బాధ్యతలు చేపట్టనున్నారు. రబుకాను అధికారంలోకి రాకుండా అడ్డగించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని బైనిమరా మా వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రహస్యంగా జరిగిన ఓటింగ్లో రబుకాకు 28ఓట్లు రాగా, బైనిమరామాకు 27ఓట్లు లభించాయి.