Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తియంగాంగ్ : చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ సంస్థ చిన్న నమూనా ఉపగ్రహాన్ని పరీక్ష నిమిత్తం కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కొత్తగా నిర్మించిన తియంగాంగ్ అంతరిక్ష కేంద్రంలోని తియాంజో 5 కార్గో షిప్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తియాంజో 5ను నవంబర్ 12 ప్రయోగించారు. 12 కిలోల బరువు ఉన్న ఈ ఉపగ్రహం పేరు మకావో స్టూడెంట్ సైన్స్ శాటిలైట్. ఆప్టికల్ కెమెరా, రేడియో పేలోడ్స్‌ను ఈ ఉపగ్రహం మోసుకెళ్లింది.మకావులోని విద్యార్థులు భూమి చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్ గురించి మరింతగా నేర్చుకునేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనున్నది. ఫొటోలు ఎలా తీయాలి? అని స్డూడెంట్స్‌కు సూచనలు ఇస్తుంది. అంతరిక్ష రంగానికి చెందిన ఇతర విషయాలు తెలసుకోవడంలోనూ ఈ ఉపగ్రహం సాయపడనుందని చైనాకు చెందిన వార్తా పత్రిక తెలిపింది. తియంగాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలు పంపిస్తామని, అంతరిక్షంలో ప్రయోగాలకు వేదికగా నిలుస్తామని అధికారులు తెలిపారు.