Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు : నేపాల్ ప్రధానిగా మూడోసారి పుష్ప కమల్ దహాల్ 'ప్రచండ' సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిపిఎన్-మావోయిస్టు సెంటర్ చైర్మెన్ ప్రచండ కొత్త ప్రధానిగా ఆదివారం నియమితులయ్యారు. 275 మంది సభ్యులు గల ప్రతినిధుల సభలో తనకు 169మంది సభ్యుల మద్దతు వుందని పేర్కొంటూ అధ్యక్షురాలు వైద్య దేవి భండారికి లేఖను అందజేసిన తర్వాత ప్రధానిగా ఆయన నియామకం జరిగింది. శీతల్ నివాస్ వద్ద అధికారికంగా జరిగిన కార్యక్రమంలో అధ్యక్షురాలు భండారీ ఆయన చేత ప్రమాణం చేయించారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని ముగ్గురు డిప్యూటీ మంత్రులు, ఇతర క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేశారు. నేపాలీ కాంగ్రెస్ నేతృత్వంలో ఎన్నికల ముందస్తు పొత్తు నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నేత కె.పి.శర్మ ఓలితో ప్రచండ చేతులు కలిపిన మరుసటి రోజే ఈ నియామకం జరిగింది. ఓలి పార్టీకి చెందిన విష్ణు పాడల్కు ఆర్థిక మంత్రిత్వ శాఖ దక్కింది. అధిక మెజారిటీతో ప్రధానిగా నియమితులైనా, 30 రోజుల్లోగా దిగువ సభ విశ్వాసాన్ని ప్రచండ పొందాల్సి వుంటుంది.