Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైఫిడో : అవినీతి కేసులో మయన్మార్‌లోని జుంటా కోర్టు శుక్రవారం అంగ్సాన్సూకీని దోషిగా తేల్చింది. ఏడేండ్లపాటు జైలుశిక్ష విధించినట్టు ఓ న్యాయ అధికారి తెలిపారు. నేటితో అన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి 18 నెలల సుదీర్ఘ విచారణ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. మొత్తంగా ఆమె 33 ఏండ్ల పాటు జైలులో ఉండాల్సి వుంటుందని కోర్టు తెలిపింది. శుక్రవారం ముగిసిన కేసులో అంగ్‌సాన్ సూకీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. విన్ మయత్ ఆరు నియామకానికి అనుమతి ఇవ్వడంతో పాటు ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించి నిధులను విడుదల చేశారనీ, ఒక హెలికాఫ్టర్‌ను కొనుగోలు చేసినట్టు ఆమెపై అభియోగాలను మోపారు. గతేడాది ఫిబ్రవరిలో అంగ్‌సాన్ సూకీ నుంచి మయాన్మార్‌లోని జుంటా సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి అంగ్‌సాన్‌సూకీ పై వరుసగా కరోనా నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం చేయడం, అక్రమంగా రేడియో కలిగి ఉండటం, రెచ్చగొట్టడం, ప్రభుత్వ రహస్య చట్టాన్ని ఉల్లంఘించడం, దేశ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం వంటి వివిధ రకాల అభియోగాలను మోపింది.