Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెతన్యాహూ తిరిగి అధికారం చేపట్టడాన్ని స్వాగతించిన పుతిన్
మాస్కో : ఇజ్రాయిల్‌లో బెంజిమన్ నెతన్యాహూ తిరిగి అధికారం చేపట్టడాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసేందుకు సంకేతాన్నిచ్చిందని రష్యా అధికార పత్రిక క్రెమ్లిన్ తెలిపింది. మీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ప్రజలకు లబ్ది చేకూరేలా రష్యా-ఇజ్రాయిల్‌ల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నానని పుతిన్ నెతన్యాహూకి ఓ సందేశాన్ని పంపారు. అలాగే మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలను నెలకొల్పుతుందని పేర్కొన్నారు. రష్యాలో, ఇరు దేశాలమధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయడానికి మీ వ్యక్తిగత, దీర్ఘకాల సహకారాన్ని ప్రశంసిస్తున్నానని అన్నారు. ఇజ్రాయిల్ పార్లమెంట్ కొత్త ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన కొద్ది క్షణాల తర్వాత నెతన్యాహూ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా చొరబాటును ప్రారంభించిన నాటి నుంచి ఇజ్రాయిల్ రష్యా పట్ల సంయమనం పాటించింది. ప్రత్యేకించి రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధాల నెలకొనాలని ఉద్ఘాటించింది. ఇజ్రాయిల్‌లో మాజీ సోవియట్ యూనియన్ నుంచి మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోనే నివసిస్తున్నారు. ఇజ్రాయిల్‌కు భద్రత, సంక్షేమం అందించేలా నెతన్యాహూ పాలనను కొనసాగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా నెతన్యాహూకి శుభాకాంక్షలు తెలిపారు. నెతన్యాహూ చిరకాల స్నేహితుడని పేర్కొన్నాడు. ఇరాన్ నుండి బెదిరింపులతో పాటు ఇజ్రాయిల్ మరియు మధ్యప్రాచ్య ప్రాంతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను, అవకాశాలను సంయుక్తంగా పరిష్కరించేందుకు అతనితో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని బైడెన్ పేర్కొన్నారు.