Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమైక్యంగా వుండాలని జిన్‌పింగ్ పిలుపు
బీజింగ్ : కరోనా వేళ ప్రజల ప్రాణాలను కాపాడడానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది చైనా విధానమని అధ్యక్షులు జీ జిన్‌పింగ్ చెప్పారు. కొత్త సంవత్సరం 2023 లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శనివారం ఆయన టివిలో జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి పట్ల దృక్పథంలో 'కొత్త దశ' లోకి ప్రవేశిస్తున్నందున మరింత ఐక్యత, కృషి అవసరమని పిలుపిచ్చారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా సాగిన పోరులో అనూష్యంగా ఎదురైన కష్టాలను, సవాళ్ళను చైనా విజయవంతంగా అధిగమించిందని పేర్కొన్నారు. అవసరమైన పరిస్థితులు తలెత్తినపుడు ఆ సమయం ఆసన్నమైనపుడు కరోనా విధానాలు గరిష్ట స్థాయిలో తీసుకున్నట్లు తెలిపారు. జీరో కోవిడ్ విధానాన్ని రద్దు చేసిన తర్వాత కోవిడ్ కట్టడి కొత్త విధానాలకు సంబంధించి జిన్‌పింగ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రధమం. దాదాపు మూడేళ్ళుగా అనుసరిస్తూ వచ్చిన మూకుమ్మడి పరీక్షలు, కేంద్రీకృత క్వారంటైన్, లాక్డౌన్ వంటి చర్యల ప్రాతిపదికన కఠినంగా జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేసిన చైనా ఆ తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసింది.