Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి, 37మందికి గాయాలు
మాస్కో : రష్యాలో ఇటీవల విలీనమైన జపోర్జియా రీజియన్‌లోని వాసిలెవ్కా నగరంలోని నివాస భవనంపై ఉక్రెయిన్ బలగాలు దాడులు జరిపాయని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్ బుధవారం తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 37మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని పేర్కొన్నారు. ''ప్రస్తుతం వాసిలెవ్కా నగ రంలో పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. దాడులు ఆగలేదు. ప్రజలకు సాయం చేసేందుకు అన్ని అత్యవసర సర్వీసులు పనిచేస్తున్నాయి.'' అని గవర్నర్ తన టెలిగ్రామ్ చానల్లో తెలిపారు. నగర వీధుల్లో ధ్వంసమైన వాహనాలు, భవనాల ఫోటోలను ఆయన షేర్ చేశారు. ఈ దాడి జరపడానికి అమెరికా సరఫరా చేసిన ఎం142 హిమ్రాస్ బహుళ రాకెట్ లాంచర్‌ను కీవ్ వాడిందని సీనియర్ ప్రాంతీయాధికారి తెలిపారు. వీధుల్లో ఎవరూ తిరగవవద్దని, అంద రూ రక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని వాసిలెవ్కా మేయర్ కోరారు.