Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆక్రమిత జెరూసలేం : ఇజ్రాయిల్ జైళ్లలో సుదీర్ఘకాలం నిర్బంధించబడిన పాలస్తీనా ఖైదీ కరీం యూనిస్ ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. 40ఏళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన కరీం యూనిస్ (66)ను గురువారం ఉదయం టెల్‌అవీవ్‌లోని హదరిమ్ జైలు నుండి విడుదల చేసినట్లు ఇజ్రాయిల్ జైలు అధికారులు తెలిపారు. 1983లో కరీంను అరెస్టు చేశారు. అంతకు మూడేళ్ల ముందు ఆక్రమిత సిరియన్ గోలన్ హైట్స్‌లో ఇజ్రాయిల్ సైనికుడిని హతమార్చాడంటూ కరీంపై అభియోగాలు మోపారు. పాలస్తీనా గ్రామం అరాకికి చెందిన కరీం విడుదల కాగానే బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. వేర్వేరు పోలీసు కార్లలో అనేక ప్రాంతాలు తిప్పుతూ, ఎట్టకేలకు టెల్ అవీవ్‌కు ఉత్తరంగా గల పట్టణంలోని ఒక బస్ స్టేషన్లో తనను వదిలిపెట్టారని కరీం చెప్పారు. ఇజ్రాయిల్ ఆక్రమణలను ప్రతిఘటించినందుకే కరీంను అరెస్టు చేశారని పాలస్తీనా పేర్కొంది.