Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా : టెక్నలాజీ దిగ్గజం ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) టిమ్ కుక్ జీతంలో భారీగా కోత పడింది. గత ఏడాది టిమ్ 99 మిలియన్ల డాలర్ల వేతనం పొందారు. దీంట్లో 3 మిలియన్ల డాలర్ల బేస్క్ వేతనం ఉంది. 83 మిలియన్ల డాలర్ల స్టాక్ అవార్డులు, బోనస్ ఉన్నాయి. కాగా 2023లో టిమ్ కుక్ 49 మిలియన్ల డాలర్ల వేతనం తీసుకోనున్నారు. అంటే దాదాపుగా సగం వేతనానికి కోత పడినట్లయ్యింది. దీనికి మార్చి 10న జరగనున్న ఇన్వెస్టర్ డేలో వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. తన జీతాన్ని తగ్గించాలని టిమ్ కుక్‌నే కోరినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభ చాయలు నెలకొన్న నేపథ్యంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరోవైపు అధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఉద్యోగులు వేతనాలు పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కుక్ వేతనం తగ్గించుకోవడం ద్వారా ఉద్యోగుల డిమాండ్‌ను సద్దుమనిగేలా చేయొచ్చనేది కంపెనీ అంతరంగమని నిపుణులు భావిస్తున్నారు.