Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమల్లా : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో శనివారం తెల్లవారు జామున ఇజ్రాయిల్ బలగాలు ఇద్దరు పాలస్తీనియన్లను హత్య చేశాయని పాలస్తీనా అధికారులు తెలిపారు. దాదాపు రెండు వారాల ముందు జరిగిన మరో దాడిలో తీవ్రంగా గాయపడిన మరో పాలస్తీనియుడు మరణించాడు. వాహనంపై వెళుతున్న సాయుధులు తమపై కాల్పులు జరపడంతో తమ సైనికులు కూడా ఎదురు కాల్పులు జరిపారని మిలటరీ తెలిపింది. ఆ కాల్పుల తర్వాత ఆ వాహనం నుండి ఎం.-16 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 12కి చేరింది. మరణించిన ఇద్దరినీ వెస్ట్ బ్యాంక్ ఉత్తరప్రాంతంలోని జెనిన్ నగర వాసులుగా గుర్తించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.