Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉక్రెయిన్‌కు ట్యాంక్‌లు, శతఘ్నులు పంపనున్న బ్రిటన్
బ్రస్సెల్స్ : రష్యాపై పోరులో ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక సాయం నాటో మిత్ర దేశాల నుంచి కొనసాగుతోంది. రష్యా మిలటరీ కార్యకలాపాలు పర్యవేక్షించడానికి రొమేనియాకు నిఘా విమానాన్ని పంపించనున్నట్లు నాటో కూటమి శుక్రవారం తెలియచేయగా, మరోవైపు ట్యాంక్‌లు, శతఘ్ని వ్యవస్థలను అందజేస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన రొమేనియాలో నాటో తన బలగాలను బలోపేతం చేసింది. ''మా అవాక్స్ (గాల్లోనే హెచ్చరికలు జారీ చేయగల, నియంత్రణ వ్యవస్థతో కూడిన విమానాలు) వందలాది కిలోమీటర్ల దూరంలో గల విమానాన్ని కూడా కనిపెట్టగలవు. నాటో నిరోధక, రక్షణ సామర్ధ్యానికి ఇవి కీలకమైన రీతిలో దోహదపడతాయి'' అని నాటో ప్రతినిధి ఓనా లాంగెస్కూ ఒక ప్రకటనలో తెలిపారు. బుఖారెస్ట్కి సమీపంలోని ఒటోపెనికి మంగళవారానికి ఈ విమా నాలు చేరతాయి. అక్కడ నాటో బోయింగ్ అవాక్స్ దళంలో భాగమవుతాయి. రొమేనియా నుండి గస్తీకి ఎన్ని అవాక్స్ విమానాలను మోహరిస్తోందో నాటో వెల్లడించలేదు. ఒటొపెనిలో రొమేనియా వైమానిక స్థావరంలో దాదాపు 180మంది సైనిక సిబ్బంది వుంటారు. పలు వారాల పాటు ఈ మిషన్ కొనసాగుతుందని నాటో తెలిపింది. శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో బ్రిటన్ ప్రధాని మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన చేస్తూ, ఛాలెంజర్ 2 ట్యాంక్‌లు, ఇతర శతఘ్ని వ్యవస్థలను కీవ్‌కు అందజేస్తామని హామీ ఇచ్చారు. బ్రిటీష్ ఆర్మీ ఛాలెంజర్ 2 మెయిన్ ట్యాంకులను నాలుగింటిని తూర్పు యూరప్‌కు తక్షణమే పంపుతున్నట్లు బ్రిటీష్ మీడియా తెలిపింది. ఆ తర్వాత మరో ఎనిమిది ట్యాంకులు పంపనున్నట్లు పేర్కొంది.