Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ చర్చను హైజాక్ చేస్తున్నారు
- పర్యావరణ కార్యకర్తల ఆందోళన
- పెద్ద చమురు సంస్థల పాత్రకు వ్యతిరేకంగా దావోస్‌లో నిరసన
దావోస్ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో పెద్ద చమురు సంస్థల పాత్రపై వాతా వరణ కార్యకర్తల నుంచి ఆందో ళన వ్యక్తమైంది. సంస్థల పాత్రకు వ్యతిరేకంగా వారు దావోస్‌లో నిరసన తెలిపారు. (పెద్ద చము రు సంస్థలు) వాతావరణ చర్చను హైజాక్ చేస్తున్నారని వాతావరణ కార్యకర్తలు చెప్పారు. స్విస్ రిసార్ట్‌లో జరిగే వార్షిక సమావేశానికి హాజరైన 1500 మంది వ్యాపార నాయకులలో బీపీ, చెవ్రాన్, సౌదీ అరామ్కోతో సహా ప్రధాన ఇంధన సంస్థలు ఉన్నాయి. వాతావరణ మార్పులతో సహా ప్రపంచ ముప్పులు వంటివి ఈ సమావేశపు ఎజెండాలో ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని యంగ్ సోషలిస్టు పార్టీకి నేతృత్వం వహిస్తున్న నికోలస్ సీగ్రిస్ట్ మాట్లాడుతూ.. మేము కచ్చితమైన, నిజమైన వాతావరణ చర్యను డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రపంచ వ్యాపార, రాజకీయ నేత వార్షిక సమావేశం సోమవారం దావోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ''వీరు రాజకీయ నాయకులతో ఒకే గదిలో ఉంటారు. వారి ప్రయోజనాల కోసం వారు ముందుకు వస్తారు'' అని డబ్ల్యూఈఎఫ్ సమావేశంలో ఇంధన సంస్థల ప్రమేయం గురించి మాట్లాడుతూ సీగ్రిస్ట్ అన్నారు. తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థలకు దేశాలు మారుతున్నందున ప్రపంచ ఇంధన మిశ్రమంలో శిలాజ ఇంధనాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని, శక్తి పరివర్తనలో భాగం కావాలని చమురు, గ్యాస్ పరిశ్రమ పేర్కొన్నది. దావోస్ స్క్వేర్‌లో కురుస్తున్న మంచును సైతం లెక్క చేయకుండా వంద మందికి పైగా నిరసనకారులు గుమిగూడి ఆందోళనను చేపట్టారు. నినాదాలు వినిపించారు. 'వాతావరణానికి అనుగుణంగా మీ తిండి అలవాట్లను మార్చుకోండి' అని నినాదాలు చేశారు. ''కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయా లలో నిమగమై ఉన్నాయని నాకు తెలుసు. కానీ ప్రభుత్వాలు వారి సబ్సిడీలతో ప్రత్యామ్నాయ శక్తికి అనుకూలంగా వ్యవస్థను మార్చాలని నేను భావిస్తున్నాను'' అని నిరసనలో పాల్గొన్న 99 % సంస్థ సభ్యులు హీథర్ స్మిత్ చెప్పారు. '' పెరుగుతున్న వడ్డీ రేట్లు పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి ఫైనాన్సింగ్‌ను ఆకర్షించడం కష్టతరం చేశాయి. శిలాజ ఇంధన పెట్టుబడుల నుంచి ఇంకా చాలా ఎక్కువ డబ్బు సంపాదించాల్సి ఉన్నది'' అని తెలిపారు.