Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆనాటి ఊచకోత రాజకీయ ప్రేరేపితం
- ఒక వర్గం వారిపై హిందూత్వ శక్తుల్ని ఊసిగొల్పి..పోలీసులను ఆపారు
- అల్లర్లకు వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ ప్రణాళిక : బ్రిటీష్ ప్రభుత్వ విచారణ బృందం నివేదిక
- నివేదికలోని ముఖ్యాంశాలతో బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం
లండన్ : 2002 గుజరాత్ అల్లర్లకు ప్రధాన బాధ్యుడు ఆనాటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోడీ..అని బ్రిటీష్ ప్రభుత్వ విచారణ బృందం తేల్చింది. అంతేకాదు, ఊచకోతకు, అల్లర్లకు పాల్పడిన హిందూత్వ శక్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని, ఏం చేసినా పోలీసులు అడ్డుకోరనే సంకేతాలు పంపినందువల్లే దారుణాలు జరిగాయని విచారణ బృందం నిర్ధారించింది. విచారణ బృందం నివేదికలోని ముఖ్యాంశాల్ని చూపుతూ మంగళవారం బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. దీంతో గుజరాత్ అల్లర్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 'ద మోడీ క్వశ్చన్' అనే పేరుతో డాక్యుమెంటరీ ప్రసారమైంది. విచారణ బృందంలోని సభ్యుడైన ఒక మాజీ దౌత్యవేత్త మాట్లాడుతూ, ''విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు అల్లర్లకు ప్రణాళికలు వేశాయి'' అని చెప్పారు. మోడీ ప్రభుత్వం నుంచి లభించిన పోలీస్ రక్షణతోనే వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్లు చెలరేగిపోయాయని, అమాయక పౌరులపై దాడులకు తెగబడ్డాయని నివేదిక స్పష్టంగా పేర్కొంది. విచారణ బృందం నివేదిక బ్రిటన్ ప్రభుత్వానికి చేరిందని, ఇందులోని విషయాలేవీ ఇప్పటివరకూ బయటకు రాలేదని డాక్యుమెంటరీ పేర్కొంది. బుధవారం వెబ్సైట్ నుంచి డాక్యుమెంటరీని బీబీసీ తొలగించింది.
గోద్రా రైలు దర్ఘుటనలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోవటంతో 2002 ఫిబ్రవరి-మార్చి మధ్యకాలంలో గుజరాత్ అంతటా మైనార్టీ ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. అల్లర్లలో 790మంది ముస్లింలు, 254మంది హిందువులు చనిపోయారని అధికారిక నివేదికలో గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. మత ఘర్షణల్ని గుజరాత్ ప్రభుత్వం అడ్డుకోలేదన్న ఆరోపణల్ని సీఎంగా నరేంద్రమోడీ తిరస్కరించారు. అయితే తాజాగా బహిర్గతమైన బ్రిటీష్ ప్రభుత్వ విచారణ నివేదిక మాత్రం అల్లర్లకు ప్రధాన బాధ్యుడు నరేంద్రమోడీయేనని ఆరోపించింది. గుజరాత్ పోలీస్ రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోకుండా ఆయనే అడ్డుకున్నారని విచారణ నివేదిక పేర్కొంది. ఈ మొత్తం ఘటనపై ప్రత్యేక విచారణ బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయగా, సరైన సాక్ష్యాధారాలు లేవని మోడీ, మరో 63మందికి క్లీన్చిట్ లభించింది. సిట్ నివేదికను 2013లో సుప్రీం ఆమోదించింది. అయితే పోలీసులు రంగంలోకి దిగకుండా నరేంద్ర మోడీ అడ్డుకున్నారనేందుకు ఆధారాలున్నాయని బ్రిటీష్ ప్రభుత్వ నివేదిక ఆరోపించటం గమనార్హం.
బయటకు తెలిసిందే కొంతే
గుజరాత్ 2002 అల్లర్లు రాజకీయ ప్రేరేపితం. ఇందులో లక్ష్యం సుస్పష్టం. హిందువులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఊచకోత సాగింది. ఈ ఊచకోతలో బలైన వారి వివరాలన్నీ బయటకు రాలేదు. మీడియాలో, ఇతర మాధ్యమాల్లో బయటకు తెలిసినదానికంటే ఎక్కువగా క్షేత్రస్థాయిలో ఊచకోత సాగిందని డాక్యుమెంటరీ తెలిపింది. ఒక వర్గానికి చెందినవారిని ప్రణాళిక ప్రకారం చంపారని, లైంగికదాడులు ఎక్కువ సంఖ్యలో జరిగాయని పేర్కొంది. ప్రధాని మోడీపై గుజరాత్ అల్లర్లు ఒక మాయని మచ్చ..అని బ్రిటీష్ మాజీ విదేశాంగ కార్యదర్శి జాక్ స్ట్రా ఆరోపించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని అన్నారు. సీఎంగా ఉన్న మోడీ ఆనాడు హిందూత్వ శక్తులను ఊసిగొల్పి, మరోవైపు పోలీసుల చేతులు కట్టేశారని చెప్పారు. ఈ ఆరోపణల కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం 2005 నుంచి 2014 వరకు మోడీక వీసా నిరాకరించింది.