Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ దేశ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక దాదాపు ఖరారైంది. ప్రస్తుత ప్రధాని జెసిండా ఆర్డెన్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార లేబర్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన ఎంపీ, మాజీ మంత్రి హిప్కిన్స్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌కు ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ ఎంపీలు మద్దతు తెలియచేయాల్సి వుంది. అయితే బరిలో ఎవరూ లేకపోవడం, కేవలం ఒకే ఒక నామినేషన్ రావడంతో తదుపరి ప్రధానిగా 44 ఏళ్ళ హిప్కిన్స్ ఎన్నికైనట్లు లేబర్ పార్టీ ప్రకటించింది. దీంతో ఆయన దేశ 41వ ప్రధానిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.