Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐరాస : చిన్నారుల మృతికి కారణమైన దగ్గు సిరప్‌ల తయారీ సంస్థల మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) దర్యాప్తు చేపడుతోంది. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాలను ఆదేశించినట్టు మంగళవారం సంబంధిత అధికారులు తెలి పారు. చిన్నారుల మరణాలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారులు తెలిపారు. భారత్, ఇండోనేషియాల్లో తయారైన దగ్గు సిరప్‌ల కారణంగా మూడు దేశాల్లో 300 మందికి పైగా చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. గాంబియా, ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. భారత్, ఇండోనేషియాలో తయారైన ఆరు ఔషధ కంపెనీలతో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయనీ, దీంతో ఈ కంపెనీల మధ్య ఏదైనా సంబంధం ఉందా అని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. జులై 2022లో గాంబియాలో మొదటగా మరణాలు నమోదయ్యాయి. కంబోడియా, ఫిలిప్పీన్స్, తూర్పు తైమూర్, సెనెగల్ నాలుగు దేశాలకు ఈ విచారణను విస్తరించినట్టు ఆరోగ్య సంస్థ తెలిపింది. నాసిరకం మందులు నిర్మూలించేందుకు, నియంత్రించేందుకు తనిఖీలు ప్రారంభించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు ప్రపంచ ఔషధ పరిశ్రమ పిలుపునిచ్చింది.