Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింల పట్ల కొట్టొస్తున్న పక్షపాతం
- బ్రిటన్‌లో ప్రసారమైన బీబీసీ డాక్యుమెంటరీ రెండో భాగం
లండన్: భారత ప్రధాని మోడీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ఇండియా : ది మోడీ క్వశ్చన్ రెండో భాగం మంగళవారం రాత్రి బ్రిటన్‌లో బీబీసీలో ప్రసారమైంది. 2014లో మెజారిటీ కన్నా పెరిగిన బలంతో 2019లో తిరిగి ప్రధానిగా మోడీ ఎన్నికైన తర్వాత దేశంలోని ముస్లిం మైనారిటీలకు, మోడీకి మధ్య గల సమస్యాత్మక సంబంధాల గురించి ఈ భాగంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అకస్మాత్తుగా 370వ అధికరణను రద్దు చేయడం, వివాదాస్పదమైన పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (ఈ చట్టం వివక్షాపూరితంగా వుందని, రాజ్యాంగ విరుద్ధమని గణనీయ వర్గాలు భావిస్తున్నాయి. సుప్రీం కోర్టు దీనిని విచారించాల్సి వుంది), 2002లో ఈశాన్య ఢిల్లీలో రేగిన మతోన్మాద హింస వీటన్నింటినీ ఈ నివేదిక పరిశీలించింది. ఈ తుది డాక్యుమెంటరీ భాగంలో ప్రతి అంశంపైనా స్వతంత్ర నివేదికలను, సాక్ష్యాధారాలను, బాధిత పక్షాలు, విద్యావేత్తలు, మీడియా సభ్యులు, పౌర సమాజం వ్యాఖ్యలను బీబీసీ నిశితంగా పరిశీలించి, సమీక్షించింది. ప్రతి విషయంలో ప్రభుత్వ, పోలీసు బలగాల డిఫెన్స్ వాదనలను కూడా ఉటంకించింది. ఇందులో బీజేపీ దృక్కోణానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురి వ్యాఖ్యలతో సహా ప్రముఖ జర్నలిస్టు, మాజీ బీజేపీ ఎంపి స్వపన్ దాస్ గుప్తా వ్యాఖ్యలు వున్నాయి. 'ప్రజా శ్రేయస్సుకి సంబంధించి కొత్త యుగాన్ని ఆవిష్కరిస్తామని, వినూత్నమైన భారతదేశాన్ని నెలకొల్పుతామని మోడీ హామీ ఇచ్చినప్పటికీ ఆయన పాలనలో దేశంలో 'మతపరమైన కల్లోలం' ఏర్పడిందని డాక్యుమెంటరీ పేర్కొంది. గుజరాత్ అల్లర్లలో ఆయన పాత్ర లేదంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ ''ఆందోళనలు మాత్రం పోవడం లేదు'' అని డాక్యుమెంటరీ పేర్కొంది.
వేధింపులకు గురి చేసి హత్యలు
2014లో అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత, ముస్లింలను హతమార్చిన కేసులు విపరీతంగా పెరిగాయి. పింక్ రివల్యూషన్ పేరుతో గొడ్డు మాంసాన్ని రవాణా చేయడం రాన్రాను తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. ఆ తర్వాత గొడ్డు మాంసాన్ని అనేక రాష్ట్రాల్లో చట్టవిరుద్ధం చేశారు. హిందువులు గోవులను అతి పవిత్రంగా పూజిస్తారు కాబట్టి గొడ్డు మాంసం తినరాదని నిషేధించారు. గో జాగరణ అంశంపై ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా దృష్టి సారించింది. 2017లో గో సంరక్షకుల చేతుల్లో హత్యకు గురైన ఆలిముద్దీన్ అన్సారి కథను ఈ డాక్యుమెంటరీ వివరించింది. అదే రోజు మోడీ తన సుదీర్ఘ మౌనాన్ని విడనాడి మాట్లాడారు. ఆ తర్వాత, వెంటనే ఆకస్మిక పరిణామం సంభవించింది. అలీముద్దీన్ హత్య విషయంలో బీజేపీ ప్రతినిధి నిత్యానంద్ మహతో దోషిగా ఎలా తేలిందీ, యావజ్జీవ శిక్ష పడిన వైనాన్ని ఈ డాక్యుమెంటరీ వివరించింది. అయితే మోడీ మంత్రుల్లో ఒకరు, ఆయనకు, దోషులుగా తేలిన ఇతరులకు వారి న్యాయ ఫీజుల్లో సాయం చేశారు. పైగా వారిని పూలదండలు వేసి స్వాగతించారు. ''వారు ఈ దేశ పాలకులు, ఆ పాలకులే ఈ వ్యక్తులకు మద్దతిచ్చినపుడు మాలాంటి పేదవారం ఏమీ చేయలేం.'' అని అన్సారీ భార్య వాపోవడం ఆ డాక్యుమెంటరీలో కనిపిస్తోంది. నాలుగేళ్ళ తర్వాత, వారందరూ స్వేచ్ఛా జీవులయ్యారు అంటూ ఆ డాక్యుమెంటరీ ముగుస్తుంది.
2015 మే నుంచి 2018 డిసెంబరు మధ్య దాదాపు మూడున్నరేండ్ల కాలంలో గో సంరక్షకులు 44మందిని హత్య చేశారని, గో హింసకు సంబంధించిన ఘటనల్లో దాదాపు 280మందిని గాయపరిచారని హ్యూమన్ రైట్స్ వాచ్ డాక్యుమెంటరీలో పేర్కొంది. ఈ బాధితుల్లో చాలామంది ముస్లింలేనని తెలిపింది.
ఇలా ముస్లింలను వేధింపులకు గురి చేసి హతమార్చడమనే ధోరణి బాగా పెరుగుతూ వచ్చి దేశంలో ఒక పద్ధతిగా మారిపోవడాన్ని గురించి స్వపన్ దాస్‌గుప్తాని ప్రశ్నించగా, ఇది 'అనవసరమైన ఊహ' అని వ్యాఖ్యానించారు. మోడీ తరహా హిందూ జాతీయవాదానికి రికార్డు సంఖ్యలో భారత ఓటర్లు మద్దతిస్తున్నారంటూ దాస్‌గుప్తా ప్రధానిని వెనకేసుకువచ్చారు.
''భారతదేశం పనిచేసే తీరును హిందూ మత విధానంగా మార్చడం, భారతదేశ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక స్వభావాన్ని కోలుకోలేని రీతిలో మార్చడమనేది ఇక్కడ ప్రాధమిక లక్ష్యంగా వుంది. ముఖ్యంగా, ముసుగులు తొలిగాయి.'' అని భారత రాజకీయాలపై నిపుణుడు, సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ క్రిస్ ఓగ్డెన్ వ్యాఖ్యానించినట్లు ఆ డాక్యుమెంటరీలో వినవచ్చు.
370వ అధికరణ
2019 ఆగస్టులో 370వ అధికరణను రద్దు చేస్తూ వివాదాస్పదమైన చర్య తీసుకోవడం, తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతంగా అనూహ్యమైన రీతిలో మార్చడంపై డాక్యుమెంటరీ వ్యాఖ్యానిస్తూ, ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన 9వారాల తర్వాత కాశ్మీర్‌కు సైనిక బలగాలు పంపబడ్డాయని పేర్కొంది. ఫలితంగా కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలోకి ఆ ప్రాంతం వెళ్లిపోవడంతో 'సమాచార స్తంభన' నెలకొందని డాక్యుమెంటరీ పేర్కొంది. అయితే, తాము అనుసరిస్తున్న విధానాల వల్ల ఆ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి నెలకొంటున్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు డాక్యుమెంటరీ పేర్కొంది.
సీఏఏ, ఈశాన్య ఢిల్లీ హింస
మతాన్ని భారతదేశ పౌరసత్వంతో ముడిపెట్టడానికి ఉద్దేశించిన సీఏఏకి వ్యతిరేకంగా ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడం, అటుపై 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో మతోన్మాద హింస చోటు చేసుకోవడంపై మాట్లాడుతూ, ''ముస్లిం ఆందోళనకారులపై కరడుగట్టిన హిందూ మత పెద్దలు బెదిరింపులకు దిగారు.'' అని డాక్యుమెంటరీ పేర్కొంది.
23 ఏండ్ల ముస్లిం ఫైజాన్‌ను చనిపోయేదాకా పోలీసులు చితకబాదారని వైరల్ అయిన వీడియోను ఉటంకిస్తూ డాక్యుమెంటరీ పేర్కొంది. ''నా కొడుకు న్యాయం జరగాలి. అతడు అమాయకుడు, ఏ కారణం లేకుండానే చంపేశారు.'' అని ఫైజాన్ తల్లి బాధపడడం ఆ డాక్యుమెంటరీలో వినవచ్చు.
2020 ఢిల్లీ అల్లర్లలో మరణించిన వారిలో మూడింట రెండు వంతుల మంది ముస్లింలేనని తెలుస్తోందని ఆ చిత్రం పేర్కొంది. వేధింపులకు దిగడం, అనుచితంగా వ్యవహరించడంతో సహా పోలీసులు తీవ్రంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆందోళనకారులపై మితిమీరి, ఏకపక్షంగా బల ప్రయోగానికి దిగారని, హింస, అల్లర్లలో చురుకుగా పాల్గొన్నారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన దర్యాప్తును ముగిస్తూ చేసిన వ్యాఖ్యలను బీబీసీ డాక్యుమెంటరీ పేర్కొంది. పోలీసులు వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించలేదని ఒకవేళ వ్యవహరించినా, ప్రతిసారీ తప్పుడు వ్యక్తులనే నిందిస్తూ వచ్చారని, బాధితులనే హింసకు పాల్పడిన వ్యక్తులుగా పేర్కొంటూ వచ్చారని, ఈ చర్యలపై సక్రమంగా దర్యాప్తు జరగాలని తాము కోరామని, కానీ అది ఇంతవరకు జరగలేదంటూ ఢిల్లీలో జరిగిన అల్లర్లపై అమ్నెస్టీ నివేదిక పేర్కొందంటూ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా అధ్యక్షుడు అకార్ పటేల్ వ్యాఖ్యానించడం ఆ చిత్రంలో వినిపిస్తుంది.''పోలీసులను తక్కువగా చేస్తూ, పక్షపాతంగా వ్యవహరించారని, మానవ హక్కుల ఉల్లంఘనలంటూ దురుద్దేశ్యపూర్వకంగా కేసు పెట్టారంటూ'' అమ్నెస్టీ నివేదికపై ఢిల్లీ పోలీసులు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చిత్రంలో వున్నాయి.
అల్లర్ల సమయంలో పోలీసులు 2వేల మందికి పైగా అరెస్టు చేశారు, వీరిలో హిందువులు, ముస్లింలు కూడా వున్నారు. ప్రభుత్వం తమని కాపాడుతుందనే భావనతో వుండవద్దంటూ ముస్లింలకు సందేశాన్ని పంపారని చిత్రంలో జర్నలిస్టు అలిసాన్ జాఫ్రి వ్యాఖ్యానించినట్లు వినిపిస్తుంది. ''ఇది జరుగుతుందని నువ్వు అనుకున్నావా? ర్వాండాలా నిజంగా తయారవుతుందనుకుంటున్నావా?'' అని మేం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం. ఈ చిత్రంలో నేనెందుకు మాట్లాడాలి? దీంతో మేమెవరం ఏకీభవించలేదని రికార్డవడానికి ఇది చేయాలి, అంతేకానీ సాయం కోసం పిలుపు కాదు ఇది, ఎందుకంటే ఏ సాయమూ రాదు కనుక'' అని అరుంధతి రారు వ్యాఖ్యానించారు.