Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూమికి అత్యంత సమీపానికి వచ్చి వెళ్లిన '2023బియు'
- ఇంత దగ్గరగా ఇంతకు ముందెప్పుడూ రాలేదు : నిపుణులు
వాషింగ్టన్ : రెండు రోజుల క్రితం అంతరిక్షంలో ఒక అద్భుతం జరిగింది. భూమికి తృటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అంతరిక్షంలో గురువారం రాత్రి భూమికి కేవలం 3600 కిలోమీటర్ల దూరంలో నుంచి '2023బియూ' అనే ఆస్టరాయిడ్ వెళ్లిపో యింది. భూమికి ఇంత సమీపంగా ఒక ఆస్టరాయిడ్ ఎప్పుడూ రాలేదని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. ఒక ట్రక్ పరిమాణంలో ఉండే ఈ ఆస్టరాయి డ్ ఒకవేళ భూమిని తాకితే ఊహించని స్థాయిలో నష్టముంటుంది. భూమిని ఢకొీనేలా '2023బియూ' వచ్చుంటే, దానిపైకి అణ్వాయుధం ప్రయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే దని శాస్త్రవేత్తలు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఆస్టరాయిడ్ గమనాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. విశ్వం, అంతరిక్షంపై ఆసక్తి కలిగిన కొంతమంది క్రిమియా వద్ద నుంచి బైనాక్యూలర్స్, టెలిస్కోపిక్ పరికరాలతో '2023బియు'ను చూసి నట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఈ ఆస్టరాయిడ్ గమనాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం గమనిస్తూ వస్తు న్నారు.'2023బియూ' పరిమాణం 3.5 నుంచి 8.5 మీటర్ల వెడల్పుతో ఉండొచ్చని, ఒకవేళ ఇది భూమిని ఢకొీనే దిశగా వచ్చినా...వాతావరణంలో మండిపో తుందని, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపో తుందని ఒక శాస్త్రవేత్త వివరించారు. అయితే భూమి నుంచి 900 కి.మీ ఎత్తులో ఉన్న వేలాది శాటిలైట్స్ దెబ్బతినే అవకాశముంది. ఈ ఆస్టరాయిడ్ ఎటుపో తోంది? అన్నదానిపై శాస్త్రవేత్తలు అనేక లెక్కలు వేశారు. నాసా ప్రమాద, ప్రభావ అంచనా వ్యవస్థను ఆధారంగా చేసుకొని అనేకమంది నిపుణులు విశ్లేషించారు. '2023బియూ' ప్రశాంతంగా తన దారిలో పోతుందని అంచనావేశారు. వారు ఊహించినట్టుగానే అది తన కక్ష్యామార్గంలో వెళ్లిపోయిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఏ ఆస్టరాయిడూ భూమికి ఇంత సమీపంగా రాలేదని, భూ గురుత్వాకర్షణ శక్తి ఆస్టరాయిడ్ గమనాన్ని ప్రభావితం చేసిందని నిపుణులు చెబుతున్నారు.