Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'బీబీసీ డాక్యుమెంటరీ' విషయంలో భారత్కు జర్మనీ పిలుపు
జర్మనీ: బీబీసీ డాక్యుమెంటరీపై మోడీ సర్కారు నిర్ణయం భారత్ లోనే కాక అంతర్జాతీయంగానూ విమర్శలను ఎదుర్కొంటున్నది. కేంద్రం నిర్ణయాన్ని పత్రికా, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా నిపుణులు అభివర్ణిస్తు న్నారు. ఈ విషయంలో ఐరోపా దేశం జర్మనీ కూడా స్పందిం చింది. పత్రికా మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ ముఖ్యమని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. డాక్యుమెంటరీపై భారత్లో వివాదం కొనసాగుతున్న వేళ జర్మనీలో పత్రికా సమావేశంలో భాగంగా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను కల్పిస్తుందని ఆయన అన్నారు. వాటిలో భావ ప్రక టన మరియు పత్రికా స్వేచ్ఛ ఉన్నదని తెలిపారు. భారత్తో ఈ విలువలను జర్మనీ పంచుకుంటుందని తెలిపారు. ఈ విలువల కోసం జర్మనీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ప్రకటనకు రెండు రోజుల ముందే యూఎస్ సెనేట్ విభాగం అధికార ప్రతినిధి నెడ్ ప్రిన్స్ కూడా భారత్లో కొనసాగుతున్న వివాదం '' పత్రికా స్వేచ్ఛకు సంబంధిం చిన అంశం'' అని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు జర్మనీ కూడా ఈ వివాదంపై స్పందించడంతో భారత్లో పత్రికా, భావ ప్రక టనా స్వేచ్ఛపై మోడీ సర్కారు చేస్తున్న దాడులు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నా యని నిపుణులు తెలిపారు. కేంద్రం నిర్ణయాలు అంతర్జా తీయ వేదికల్లో భారత ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.