Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్ : ఉగ్రవాదులతో తనను హత్య చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీకే ఇన్సాఫ్ అధ్యక్షులు ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. ఈ కుట్ర వెనుక మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పాత్ర ఉందని. ఇందుకోసం ఒక ఉగ్రవాద సంస్థకు భారీగా నగదు ఇచ్చారని కూడా ఆరోపించారు. ప్రభుత్వం నుంచి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తనను చంపడానికి జర్దారీ ఉపయోగిస్తున్నారని తెలిపారు. గతంలో తనపై దాడికి కుట్ర పన్నిన వారికీ ఇందులో భాగస్వామ్యం ఉందని తెలిపారు. 'ఇప్పుడు ప్లాన్ 'సి' అమలు చేస్తున్నారు. దీని వెనుక ఆసిఫ్ జర్దారీ ఉన్నారు. అతని దగ్గర లెక్కలేనంత అవినీతి సొమ్ము ఉంది. ఆ డబ్బును ఆయన ఓ ఉగ్రసంస్థకు ఇచ్చారు. ఈ మొత్తం కుట్రలో శక్తిమంతమైన ప్రభుత్వ సంస్థ పాత్ర కూడా ఉంది' అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.