Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఆదివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రాంతంలోని లాస్బెలాలో జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. 48 మంది ప్రయాణికులున్న ఈ బస్సు క్వెట్టా నుంచి కరాచీ వెళ్తోంది. బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢ కొట్టిందని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన సీనియర్ అధికారి హంజా అంజుమ్ తెలిపారు. ఆ వెంటనే కాలువలోకి దూసుకువెళ్లిందనీ, దీంతో బస్సులో మంటలు చెలరేగాయని అన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని చెప్పారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం.. 2018లో పాకిస్తాన్ రోడ్డు ప్రమాదాల్లో 27,000 మందికి పైగా మరణించినట్టు సమాచారం.